రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఈ రోజు ఈశాన్య, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని ఐఎండీ సంచాలకులు తెలిపారు. ఎల్లుండి వడగండ్ల వర్షాలు మినహా ఇదే పరిస్థితి నెలకొంటుందన్నారు.
నిన్న విదర్భ దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9కి.మీ. నుంచి 1.5కి.మీ. ఎత్తు మధ్యన కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్