ETV Bharat / state

శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్​ రెడ్డి ఏకగ్రీవం

author img

By

Published : Mar 14, 2022, 11:08 AM IST

Updated : Mar 14, 2022, 4:32 PM IST

legislative council chairman gutta sukhender reddy
శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్​ రెడ్డి

11:06 March 14

Gutta Sukhender Reddy as legislative Council Chairman: మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి

Gutta Sukhender Reddy as legislative Council Chairman: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి శాసన మండలి ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఛైర్మన్​గా ఎన్నుకున్నందుకు మంత్రులు, మండలి సభ్యులు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికకు మంత్రులు హరీశ్​ రావు, కేటీఆర్, మల్లారెడ్డి, జగదీశ్​ రెడ్డి, సత్యవతి రాఠోడ్, శ్రీనివాస్ గౌడ్​, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి సేవలను కొనియాడారు.

అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా...

దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయని... తెలంగాణ కౌన్సిల్​లో మాత్రమే అర్థవంతమైన చర్చ జరుగుతూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని సభ్యులు కొనియాడారు. కౌన్సిల్ హౌస్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. అధికారులు, ప్రభుత్వ పని తీరు కమిటీ సమావేశాల ద్వారానే తెలుస్తుందని సభ్యులు పేర్కొన్నారు.

ఆ ఇద్దరూ రైతులే!

వార్డు మెంబర్ నుంచి శాసన మండలి ఛైర్మన్​గా గుత్తా అనేక సేవలు అందించారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక అంశాలపై గుత్తా సుఖేందర్ రెడ్డితో చర్చించేవారమని గుర్తుచేసుకున్నారు. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు రైతులే అని ​ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులతో పాటు.. ఎక్కువ సభ్యులు ఉన్న అధికార పార్టీ సభ్యులకు కూడా మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఛైర్మన్​ను కోరారు.

రెండు సభలు ఒక్కదగ్గరే ఉండాలి..

పెద్దల సభలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కౌన్సిల్​కు అధికారుల హాజరు శాతం తక్కువగా ఉంటుంని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పాత భవనంలోకి కౌన్సిల్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే... పార్లమెంట్ మాదిరిగానే అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఉంటూ సెంట్రల్ హాల్​ను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు.

సభలో ముగ్గురే మహిళా సభ్యులు ఉన్నారని...మిగతా సభ్యులతో సమానంగా తమకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ప్రతి బిల్లుపై మహిళ సభ్యులకు మాట్లాడే సమయం.. ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి: Special Grants to Telangana : కేంద్రంపై తెలంగాణ ఆశ.. నిధులు అందక నిరాశ

Last Updated : Mar 14, 2022, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.