ETV Bharat / state

Gurupurnima festival In Shiridi : గురుపూర్ణిమ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. సాయినాధుని దర్శనం ఇక సులువుగా

Gurupurnima festival from July 2nd to July 4th : షిర్డీలో జరిగే గురుపూర్ణిమ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. జులై 02 నుంచి జులై 04 వరకు జరిగే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు.. సంస్థాన్​ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజు సాయినాధుని సమాధి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు తెలిపారు.

saibaba
saibaba
author img

By

Published : Jul 1, 2023, 5:47 PM IST

గురుపూర్ణిమ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

Shirdi Temple Is Decarate For Gurupurnima Celebrations : ఈ ఏడాది జులై 2 నుంచి జులై 4వ తేదీ వరకు జరిగే గురుపూర్ణిమ ఉత్సవాలకు షిర్డీ ముస్తాబు అవుతోంది. షిర్డీ సాయిబాబా సంస్థాన్​ తరఫున ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థాన్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ పి.శివ శంకర్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి.. ఆయన సమావేశం నిర్వహించారు.

సాయిబాబాపై విశ్వాసం ఉన్న అసంఖ్యాక భక్తులు.. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజు సాయినాధుని సమాధి దర్శనం కోసం వస్తారని ఆయన తెలిపారు. అలాగే గురుపూర్ణిమ ఉత్సవాల్లో కూడా పాల్గొంటారన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గురుపూర్ణిమ ఉత్సవాలకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఆ మూడు రోజులు ముఖ్య కార్యక్రమాలు నిర్వహణ : ఉత్సవాల్లో మొదటి రోజైన జులై 2న ఉదయం 05.15 గంటలకు శ్రీచి కాకడ హారతిని షిర్డీ సాయికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత 05.45 గంటలకు మంగళస్నానం చేయించి.. అనంతరం 07.00 గంటలకు సాయిబాబా దర్శనం, పద్యపూజ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు, సాయంత్రం 4, 6 గంటలకు ఒక్కొక్కసారి హారతి ఇవ్వనున్నారు. దీని తర్వాత సాయి కీర్తన కార్యక్రమం, శ్రేంచి ధూపరతి ఇచ్చి.. రాత్రికి మళ్లీ భజన కార్యక్రమం ఉందనుంది. రాత్రి 09.15 గంటలకు ఆ గ్రామంలో శ్రీపల్లకి ఊరేగింపు.. ఆ ఊరేగింపు తిరిగి శ్రీంచికి చేరుకోవడం జరగనుంది. ఆ రోజు మొత్తం సాయినాధుని పారాయణం చదవనున్నారు.

Gurupurnima Festival : ఉత్సవాల్లో ప్రధాన రోజైన జులై 03న అనగా సోమవారం ఉదయం 05.15 గంటలకే షిర్డీసాయికి కాకడ హారతి ఇవ్వనున్నారు. అనంతరం 05.45 గంటలకు అఖండ పారాయణ ముగింపు ఉంటుంది. తర్వాత సాయి ఫొటోతో, పోతి ఊరేగింపు ఉండి.. మంగళస్నానం, దర్శనం ఉండనుంది. ఉదయం 07 గంటలకు పద్యపూజ.. మధ్యాహ్నం హారతి ఇవ్వనున్నారు. కొన్ని భక్తి పారవస్యమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం సమయంలో భజన కార్యక్రమం ఉండనుంది. రాత్రి 9.15 గంటలకు సాయి రథోత్సవం గ్రామం నుంచి బయలుదేరుతుంది. ఆరోజు ప్రధానమైన రోజు కావున.. సాయినాథ్​ మహారాజ్​ సమాధి ఆలయం రాత్రంతా దర్శనానికి తెరిచే ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

Gurupurnima festival In Shiridi : ఆ మరుసటి రోజు చివరి రోజు కావడంతో తెల్లవారు జామున కాకడ హారతి ఇవ్వరు. మళ్లీ యథావిథిగా అన్ని కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించి.. రుద్రాభిషేకం చేయనున్నారు. పలు కార్యక్రమాలు జరపనున్నారు. అలాగే ఆసక్తిగల కళాకారులు జూలై 03న జరిగే కళాకారుల దర్శనం కార్యక్రమానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రూమ్‌లో ఆలయ సిబ్బందితో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.