ETV Bharat / state

గెస్ట్​ ఫ్యాకల్టీ నోటిఫికేషన్​ రద్దు చేయాలి: గురుకుల మహిళా టీచర్లు - gurukula guest faculty protests in hyderabad

గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్​ని వెంటనే రద్దు చేయాలని గురుకుల డిగ్రీ గెస్ట్​ మహిళా లెక్చెరర్లు డిమాండ్​ చేశారు. రెగ్యులర్​ నోటిఫికేషన్​ ఇవ్వాలని లేకుంటే తాము నష్టపోతామని వాపోయారు. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లో తెలంగాణ గురు కులాల నియామక మండలి కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు.

gurukula guest faculty pr
గెస్ట్​ ఫ్యాకల్టీ నోటిఫికేషన్​ రద్దు చేయండి: గురుకుల మహిళా టీచర్లు
author img

By

Published : Oct 11, 2020, 9:39 AM IST

రాష్ట్రంలో గురుకుల గెస్ట్‌ ఫ్యాకల్టీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ని వెంటనే రద్దు చేయాలని గురుకుల డిగ్రీ గెస్ట్‌ మహిళా లెక్చెరర్లు ఆందోళనకు దిగారు. మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ గురు కులాల నియామక మండలి కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు.

అర్హత పరీక్షల ద్వారా ఎంపికై గత ఐదేళ్లుగా ప్రభుత్వ మార్గదర్శకంలో విధులు నిర్వహిస్తున్నామనీ, ఈ నోటిఫికేషన్‌ ఇవ్వడం వల్ల నష్టపోతామని అధ్యాపకులు వాపోయారు.

రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లయితే ఎలాంటి అభ్యంతరం లేదనీ, గెస్ట్‌ ఫ్యాకల్టీ కోసమే పరీక్షలు రాయలేమని చెప్పారు. పరీక్షలు రాయని వారి కోసం కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రకటన‌ ఇవ్వాలని కోరారు.

లేనిపక్షంలో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.