ETV Bharat / state

జూన్​లోనైనా జీఎస్టీ రాబడులు పెరిగేనా..? - gst income stabilized in june for telangana

ఏప్రిల్‌, మే నెలల్లో పడిపోయిన జీఎస్టీ రాబడులు....జూన్‌ నెలలో మెరుగ్గా ఉంటాయని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. రెండు నెలల్లో వచ్చిన రాబడులను అంతకు ముందు సంవత్సరం వచ్చిన రాబడులతో పోలిస్తే...66 శాతం తగ్గినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. పెట్రోల్‌ అమ్మకాలపై రావల్సిన వ్యాట్‌లో 77శాతం, లిక్కర్‌ ద్వారా రావల్సిన వ్యాట్‌లో 67శాతం ఆదాయం తగ్గినట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

gst income stabilized in june  for telangana
జూన్​లోనైనా జీఎస్టీ రాబడులు పెరిగేనా..?
author img

By

Published : Jun 24, 2020, 7:46 AM IST

కొవిడ్‌తో ప్రపంచంతోపాటు దేశమంతా కకావికలం అయ్యింది. లాక్​డౌన్​ అమలుతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా సంభించిపోయాయి. ప్రభుత్వాలకు రావల్సిన రాబడులు రాలేదు. వ్యాపార, వ్యాణిజ్య సంస్థల నుంచి రావల్సిన పన్నులు ఏటికేడు పెరుగుదలే తప్ప తిరోగమనం అనేది ఉండదు. కానీ ఈ ఆర్ధిక ఏడాది ప్రారంభంలోనే కరనా ప్రభావంతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వస్తు సేవల పన్ను-జీఎస్టీ రాబడులు నెలకు రూ. రెండున్నర వేల కోట్లు వస్తుంది. అదే విధంగా పెట్రోల్‌ అమ్మకాలు ద్వారా మరో రూ. ఏడువందల కోట్లు, లిక్కర్‌ అమ్మకాలు ద్వారా ఇంకో రూ. ఎనిమిది వందల కోట్లు వ్యాట్‌ రాబడులు వస్తాయి. కానీ వైరస్​ ప్రభావం ఈ రాబడులపై తీవ్రంగా పడింది.

రాష్ట్రానికి అత్యధిక రాబడులు తెచ్చి పెట్టే వాణిజ్య పన్నుల శాఖపై ఏలాంటి ప్రభావం పడింది..రాబడులు ఏలా తగ్గాయి తదితర అంశాలను పరిశీలిస్తే...

పెట్రోల అమ్మకాల ద్వారా వచ్చే వ్యాట్
నెల20192020 తగ్గుదల శాతం
ఏప్రిల్673 కోట్లు181 కోట్లు73
మే611 కోట్లు111 కోట్లు82
లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చే వ్యాట్
నెల20192020 తగ్గుదల శాతం
ఏప్రిల్680 కోట్లు0100
మే800 కోట్లు495 కోట్లు38
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)
నెల20192020 తగ్గుదల శాతం
ఏప్రిల్2,375 కోట్లు483 కోట్లు80
మే1,823800 కోట్లు954 కోట్లు48

జూన్​లో కొంత మెరుగుపడే అవకాశం

గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.4197 కోట్లు మేర జీఎస్టీ రావాల్సి ఉండగా రూ.1437 కోట్లు మాత్రమే వచ్చింది. కొవిడ్‌ ప్రభావంతో వ్యాట్‌, జీఎస్టీ రాబడులు జూన్‌ నెలలో కొంత మెరుగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుతో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండటం, పెట్రోల్‌, డీజిల్ అమ్మకాలు సాధారణ పరిస్థితుల్లోకి రావడం, వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నందున గడిచిన రెండు నెలల కంటే కూడా జూన్‌ నెలలో మెరుగ్గా ఉంటాయని లెక్కలు గడుతున్నారు.

అక్రమ రవాణాపై ప్రత్యేక నజర్

అక్రమ రవాణాపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతు ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. డివిజన్‌కు రెండు లెక్కన ప్రత్యేక బృందాలు ఏర్పాటై రాత్రి పగలు తేడా లేకుండా వాహనాలన తనిఖీలు చేయడంతో అక్రమ రవాణా తగ్గి రాబడులు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.