Group 4 Notification: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ శాఖల్లో 9,168 పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. అర్హతలు, ఖాళీలు, వేతనం తదితర వివరాలతో సమగ్ర నోటిఫికేషన్ ఈనెల 23 నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటుందని కమిషన్ కార్యదర్శి తెలిపారు. ఇరవై అయిదు విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే : మొత్తం 9వేల168 పోస్టుల్లో అత్యధికంగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలో 2వేల701 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2వేల77, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో 12వందల 45 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2, బీసీ వెల్ఫేర్‌లో 307, పౌర సరఫరాల శాఖలో 72, ఆర్ధిక శాఖలో 255 మున్సిపల్, అర్బన్ డెవల్మెంట్లో 2, 701 పోస్టులు, ఉన్నత విద్యా శాఖలో 742 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2,077 ఎస్సీ వెల్ఫేర్లో 474 పోస్టులకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. లేబర్ డిపార్ట్మెంట్లో 128 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, పాఠశాల విద్యా శాఖలో 97 పోస్టులు ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నెల 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్‌లో టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావచ్చునని అంచనా వేస్తోంది. గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లకు కూడా టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది.
ఇవీ చదవండి: