లాక్డౌన్తో ఇబ్బంది పడుతోన్న పేదలు, కార్మికులకు దాతలు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో పేదలకు చేయూతనిచ్చేందుకు శ్రీకృష్ణ ట్రస్ట్ ముందుకొచ్చింది.
సుమారు వేయి మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించి కరోనాను తరిమి కొడదామని శ్రీకృష్ణ ట్రస్ట్ సభ్యులు అన్నారు.