హైదరాబాద్‌లో గ్రీన్ కోడ్ ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగ యువత కోసం ఓ కార్యక్రమం చేపట్టింది. 10కె జాబ్స్ ఫర్ అన్ ఎంప్లాయిడ్ యూత్ (Mission 10k Jobs for unemployed youth) అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు కంపెనీ సీఈవో శివంత్ రెడ్డి తెలిపారు. ఐటీ కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన గ్రీన్ కోడ్ కంపెనీ ప్రొఫైల్‌ను ఆవిష్కరించారు. కంపెనీ అందిస్తున్న సేవలను జయేశ్ రంజన్ అడిగి తెలుసుకున్నారు.
గ్రీన్ కోడ్ ఐటీ సంస్థ నియామకాలు, స్టాఫ్ అగ్మెంటేషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్కు సంబంధించిన సేవలందించనున్నట్లు సీఈవో తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ముఖ్య లక్ష్యమని సీఈవో శివంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం కేవలం 18 నెలల్లో పది వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే మా దృఢమైన సంకల్పమని గ్రీన్ కోడ్ సీఈఓ తెలిపారు. ఈ మిషన్ వివరాలు తెలుసుకున్న జయేశ్ రంజన్ తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గ్రీన్ కోడ్ ఐటీ సొల్యూషన్స్ బిజినెస్ ప్రొఫైల్ ఆవిష్కరణలో టీఎస్ఐసీ (TSIC) ఎండీ నర్సింహ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
ts Icet Counseling 2021: నవంబర్ 3 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం