Grandson Killed Grandmother for 5 Thousand : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ.5వేలకే నానమ్మను ఓ మనవడు పొట్టనపెట్టుకున్నాడు. కుటంబీకులు తనపై అనుమానంతో అడగ్గా.. పరారైయ్యాడు. వేరే రాష్ట్రం వెళ్లి గుండు గీయించుకుని.. మూడు రోజుల తరువాత సొంత ప్రదేశానికి వచ్చాడు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పట్టుకుని.. అరెస్ట్ చేశారు.
బేగంపేట ఇన్‌స్పెక్టర్ జుట్టు భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాటిగడ్డ సమీపంలోని వికార్‌నగర్ కట్టెలమండి సమీపంలో నివసించే అరీఫాబేగం (68) ఈ నెల 14న తెల్లవారుజామున తన ఇంట్లోనే హత్యకు గురైంది. ఈమె భర్త షేక్ హమీద్ ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేసి మృతి చెందడంతో ఆయన పింఛనుతో పాటు ఇంట్లో ఓ గదిని అద్దెకివ్వగా వచ్చిన ఆదాయంతో ఒంటరిగా గడుపుతోంది. ఈమెకు హబీబ్, ఐజాబేగం ఇద్దరు సంతానం. వీరిద్దరూ ఇటీవల మృతి చెందారు. వారిలో హబీబ్‌కు ఒక కూతురు, నలుగురు కుమారులు ఉన్నారు. ఐజా బేగంకు ముగ్గురు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా అరీఫాబేగం ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు.
Wife Kills Husband With Her Boyfriend : మన బంధానికి మా ఆయనే అడ్డు.. అతన్ని చంపేసెయ్!
Old Women Murder Case in Hyderabad : చిలకలగూడలో నివసించే అరీఫాబేగం మనువడు (కొడుకు కుమారుడు) షేక్ సాబేర్ (28) అప్పుడప్పుడూ వచ్చి గొడవపడి డబ్బులు తీసుకుని వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న దగ్గర్లో నివాసం ఉంటున్న మనువడు (కూతురి కొడుకు) మోసిన్‌ఖాన్ ఇంటికి వెళ్లింది. కొద్దిసేపు అక్కడే ఉండి రాత్రి 10.30 గంటలకు తిరిగి తానుంటున్న ఇంటికి వచ్చింది. అదేరోజు రాత్రి షేక్ సాబేర్(Sheikh Saber) ఆమె ఇంటికి వచ్చి డబ్బులివ్వమని గొడవపడ్డాడు. 14న తెల్లవారుజామున బీరువాలోని రూ.5 వేలను తీసుకొని వెళ్తుండగా అరీఫాబేగం అడ్డుకుంది. పోలీసులకు చెబుతానని బెదిరించడంతో కిందికి తోశాడు. కేకలు వేయబోగా టవల్‌తో ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేశాడు. ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో భయపడిన అతను మోసిన్‌ఖాన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.
Grandson Killed Grandmother in Hyderabad : అరీఫాబేగం(Arefabegam) ముక్కు నుంచి రక్తం స్రావం, ఆమె చేతి వేళ్లలో వెంట్రుకలను గుర్తించారు. ఆమె కింద పెదవిపై కొరికిన గాట్లున్నాయి. బాధితురాలిని హుటాహుటిన సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె హత్యకు గురైనట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు షేక్ సాబర్పై అనుమానంతో అతడిని ప్రశ్నించారు. అనంతరం నిందితుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. హైదరబాద్(Hyderabad Crime News) నుంచి రైలెక్కి అజ్మీర్‌కు పారిపోయాడు. ఎవరూ గుర్తుపట్టకుండా గుండు గీయించుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో మూడు రోజుల తరవాత భాగ్యనగరానికి వచ్చిన అతడిని పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు పంపించారు.
A woman dealer brutally murdered in Peddapalli district : పెద్దపల్లి జిల్లాలో మహిళా డీలర్ దారుణహత్య