సొసైటీ పేరిట జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలంటూ హైదరాబాద్, బాలానగర్ గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించింది. పోలీసులు అడ్డుకొని.. సంఘం సభ్యులను అరెస్టు చేసి, పంజాగుట్ట స్టేషన్కు తరలించారు. అధికారుల అండతో ఒకే వ్యక్తి ఏళ్లకు తరబడి కల్లు కంపాండును నడుపుతున్నారని అసోసియేషన్ అధ్యక్షులు శివ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సింగరావు గౌడ్ అనే వ్యక్తి 35 ఏళ్లుగా తమ కులస్థులకు చెందిన కల్లు కంపాండును నడుపుతూ.. లాభాలన్నీ తానే అనుభవిస్తున్నారని శివ గౌడ్ పేర్కొన్నారు. దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలకు చెందిన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నిస్తే.. తెరాస మంత్రి తన బంధువంటూ కేసులు పెట్టిస్తానని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.
న్యాయం కోసం సీఎంను కలిసి మెమోరాండం సమర్పిద్దామని వస్తే.. పోలీసులు తమను అడ్డుకున్నారు. ప్రభుత్వం స్పందించి సొసైటీ పేరిట జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలి. తమకు లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలి
- శివ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షులు.
ఇదీ చదవండి: అడుగడుగునా అక్రమాలు.. అలసత్వం