ETV Bharat / state

Rajiv Swagruha:రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం దిశగా సర్కార్ కసరత్తు - ts news

Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం దిశగా సర్కార్ కసరత్తు వేగవంతం చేస్తోంది. క్లస్టర్ల వారీగా అమ్మకాలు సాధ్యం కాకపోవడంతో విడిగా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. నమూనా ఫ్లాట్లను సిద్ధం చేసి నిర్ణీత ధరను ఖరారు చేసి లాటరీ విధానంలో కేటాయించే ఆలోచనలో సర్కార్ ఉంది. నాలుగైదు రోజుల్లో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Rajiv Swagruha:రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం దిశగా సర్కార్ కసరత్తు

author img

By

Published : Apr 5, 2022, 4:51 AM IST

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం దిశగా సర్కార్ కసరత్తు

Rajiv Swagruha: చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఎలాగైనా విక్రయించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. హైదరాబాద్​లోని బండ్లగూడ, పోచారంతో పాటు జిల్లాల్లోని ఫ్లాట్ల విక్రయానికి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, ఫ్లాట్ల వారీగా కాకుండా క్లస్టర్ల వారీగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. దీంతో క్లస్టర్ల వారీగా ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఫ్లాట్ల విక్రయంపై సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. క్లస్టర్ల వారీగా కాకుండా విడిగా విక్రయించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లు, వాటి స్థితిగతులను పరిశీలించారు. అక్కడున్న వారితో మాట్లాడారు. వాటన్నింటి ఆధారంగా రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విడిగా విక్రయించేందుకు సర్కార్ సిద్ధమైంది.

యథాతథ స్థితిగానే ఫ్లాట్లను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్​లో సమావేశం నిర్వహించారు. కొందరు ఆర్కిటెక్ట్​లను కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఫ్లాట్లను యథాతథంగా విక్రయించేందుకు తీసుకోవాల్సిన పద్ధతిపై సమావేశంలో చర్చించారు. ఫ్లాట్లకు ఎలాంటి మరమ్మతులు చేయకుండా టవర్​కు కొన్ని చొప్పున విస్తీర్ణాల వారీగా నమూనా ఫ్లాట్లను తయారు చేయాలని నిర్ణయించారు. వాటిని చూపి కొనుగోలుదారులను ఆకర్షించాలన్నది ఆలోచన. బండ్లగూడలోని 1500 ఫ్లాట్లు, పోచారంలోని 1400 ఫ్లాట్లతో పాటు ఇతర చోట్ల ఉన్న వాటిని విక్రయించనున్నారు.

ప్రాంతాలను బట్టి చదరపు గజానికి ధరను ఖరారు చేయాలని నిర్ణయించారు. బండ్లగూడలో 3000 రూపాయలు, పోచారంలో కాస్త తక్కువగా ధర నిర్ణయించే అవకాశం ఉంది. ఇందుకోసం మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు ఇటీవల ప్లాట్లు వేలం వేసిన... మహబూబ్ నగర్, కామారెడ్డి, తాండూరు తదితర ప్రాంతాల్లో మిగిలిన వాటి విక్రయాన్ని కూడా త్వరలోనే చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలి: రాహుల్‌ గాంధీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.