పదేళ్లుగా ఎదురుచూస్తున్న యూజీసీ వేతన స్కేల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు ధన్యవాదాలు తెలిపారు. కరోనా నివారణకు ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతం పెంచడంతోపాటు, ప్రోత్సాహకాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉస్మానియా ఆస్పత్రిని 2015లో సీఎం కేసీఆర్ సందర్శించి, కొత్త బిల్డింగ్ కట్టాలని అధికారులను ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో కొన్ని శక్తులు అడ్డుపడి న్యాయస్థానాలకు కూడా వెళ్లాయని ఆరోపించారు. అయిదు రాష్ట్రాల నుంచి ఉస్మానియాకు రోగులు వస్తుంటారని తెలిపారు. ఇప్పుడున్న భవనాన్ని కూల్చి అత్యాధునిక వసతులతో కొత్తది కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనం నిర్మాణానికి ఎవరైనా అడ్డుపడితే వారిని గట్టిగా ఎదుర్కొంటామని, ప్రభుత్వానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.