మంచి అలవాట్లు, ధైర్యసాహసాలు వంటి లక్షణాలను పిల్లలు ఆదినుంచే అలవర్చుకునేలా తల్లిదండ్రులు చూడాలని గవర్నర్ సూచించారు. హైదరాబాద్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆధ్వర్యంలో గ్రాండ్ విజన్ ఫర్ యూత్ ఇన్ ఇండియా అనే అంశంతో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై.. పిల్లలు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
పిల్లల్లో పుస్తకాలు చదవటాన్ని పెంపొందించాలని.. ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు పుస్తకాలను బహుమతిగా ఇచ్చే అలవాటును అలవర్చుకోవాలన్నారు. అకడమిక్ పుస్తకాలతో పాటు.. ప్రేరణనిచ్చే పుస్తకాలు పిల్లలు చదివేలా చూడాలన్నారు. పిల్లల్లో పరీక్షలంటే భయం పోగొట్టే ప్రధాని మోదీ రచించిన ఎక్జామ్ వారియర్స్ పుస్తకాన్ని పిల్లలు చదవాలని గవర్నర్ సూచించారు.
సాధారణ స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం, నరేంద్రమోదీ, ధోని, సచిన్, పీవీ సింధు, విరాట్ కోహ్లీ వంటి వారిని పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని.. యోగా, ధ్యానం వంటివి చేస్తూ.. చదువును విస్మరించకుండా తాము ఎంచుకున్న రంగంలో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: ఎల్ఆర్ఎస్ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి