పారా క్రీడల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదిత్యా మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ రైడ్‌ను హైదరాబాద్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. నవంబర్ 19న కశ్మీర్లో ప్రారంభమైన ఈ రైడ్.. హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా గవర్నర్ వారికి అభినందనలు తెలిపారు. ఈ పారా సైకిలిస్ట్‌లు డిసెంబర్ 31 నాటికి ఏపీ, కర్నాటక, తమిళనాడు మీదుగా కన్యాకుమారి చేరుకోనున్నారు.
ఈ సందర్భంగా దివ్యాంగులు అత్యద్భుత శక్తి కలవారుగా తమిళిసై అభివర్ణించారు. కొవిడ్ సమయంలో నేరుగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదన్న గవర్నర్.. తొలిసారి దివ్యాంగులను ప్రోత్సహించే ఇన్ఫినిటీ రైడ్‌లో పాల్గొనటం గర్వంగా ఉందని తెలిపారు.
కార్యక్రమానికి నటి మంచు లక్ష్మి, మోడల్ శిల్పారెడ్డి, నటి రెజీనా కసాండ్ర, శోభూ యార్లగడ్డ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.