ETV Bharat / state

కేసీఆర్​ ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆందోళన చెందా: గవర్నర్​ తమిళిసై - అస్వస్థతకు గురైన కేసీఆర్​

Governor Wishes To CM KCR: సీఎం కేసీఆర్​ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు​ కేసీఆర్​కు లేఖ రాసిన గవర్నర్​.. త్వరగా కోలుకోవాలని కోరుతూ పుష్పగుచ్ఛం పంపించారు.

governor wishes to cm kcr
కేసీఆర్​ కోలుకోవాలని ఆకాంక్షించిన గవర్నర్​
author img

By

Published : Mar 12, 2022, 2:29 PM IST

Governor Wishes To CM KCR: సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయనకు గవర్నర్‌ పుష్పగుచ్ఛం, లేఖ పంపించారు. కేసీఆర్​ సంపూర్ణారోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్‌ లేఖలో తెలిపారు. స్వల్ప అస్వస్థతతో కేసీఆర్‌ నిన్న ఆస్పత్రికి వెళ్లారని తెలిసి ఆందోళన చెందానని పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్​ చేశారు.

విశ్రాంతి అవసరం

కేసీఆర్‌ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో పాటు ఎడమచేయి నొప్పిగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అన్ని ఫలితాలు సాధారణంగా వచ్చాయని, కేసీఆర్‌ ఆరోగ్యం బాగుందని వైద్యులు ప్రకటించారు. వరుస పర్యటనల ద్వారా కేసీఆర్​ అలిసిపోయారని.. ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు.

  • Concerned to hear the news of Hospital visit of Hon'ble CM Shri.KCR garu with minor symptoms.Pray for his good health & speedy recovery.@TelanganaCMO
    (File Photo) pic.twitter.com/kC1CE70goc

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: కేసీఆర్​కు ఏమైంది.. ఆయన వ్యక్తిగత వైద్యులేమంటున్నారు..?

కేసీఆర్​కు వారం రోజుల విశ్రాంతి అవసరం: యశోద వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.