ETV Bharat / state

Governor Tamilisai: రక్తపోటు ఓ సైలెంట్ కిల్లర్ : గవర్నర్ తమిళిసై

author img

By

Published : Aug 1, 2021, 9:47 PM IST

సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలితో రక్తపోటును నివారించవచ్చని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఇవాళ హైపర్ టెన్షన్ ఇండియన్ సొసైటీ ఆధ్వర్యంలో వర్చువల్​గా జరిగిన సైంటిఫిక్ అప్రోచ్ టు హైపర్ టెన్షన్ (SATH) సమావేశంలో ఆమె ప్రసంగించారు.

Governor Tamilisai
సైంటిఫిక్ అప్రోచ్ టు హైపర్ టెన్షన్ సమావేశంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై

దేశంలో 29 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. రక్తపోటును నిర్లక్ష్యం చేయడం వల్లే అవి తీవ్రరూపం దాల్చుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇవాళ హైపర్ టెన్షన్ ఇండియన్ సొసైటీ ఆధ్వర్యంలో వర్చువల్​గా జరిగిన సైంటిఫిక్ అప్రోచ్ టు హైపర్ టెన్షన్ (SATH) సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు.

సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలితో రక్తపోటును నివారించవచ్చని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. రక్తపోటు అనేది ఓ సైలెంట్ కిల్లర్ అని ఆమె పేర్కొన్నారు. జీవనశైలి వచ్చిన మార్పులు, అలవాట్లు రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణమని గవర్నర్ వెల్లడించారు. తద్వారా రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. శాస్త్రీయ విధానం ద్వారా రక్తపోటుపై అవగాహనను పెంపొందించడంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ ప్రతినిధుల కృషిని గవర్నర్ తమిళిసై అభినందించారు.

ఇవీ చూడండి:

TSPSYCON: 'సాంకేతిక పరిజ్ఞానంతో.. మానసిక సమస్యలను అధిగమించాలి'

governor: 'సమష్టి కృషితో మానవ అక్రమ రవాణా అరికట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.