Governor Tamili sai on EMW Mediators Parliament Program : పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు.. పబ్లిక్ న్యూసెన్స్ లిటిగేషన్లుగా మారాయని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ మీడియేషన్ రైటింగ్స్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈఎండబ్ల్యూ మీడియేటర్స్ పార్లమెంట్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
లిటిగేటర్స్ ప్రైమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, ఈ మీడియేషన్ రైటింగ్స్ వ్యవస్థాపకులు పుష్ప్ గుప్తా, స్టేట్ కో ఆర్డినేటర్ మంజీరా వెంకటేష్ , ప్రముఖ మీడియేటర్ ఏజే జావీద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. కోర్టుల్లో ఏళ్లకు ఏళ్లు కేసులు పెండింగ్‌లో ఉండాల్సిన అవసరం లేకుండా సమస్యలను పరిష్కరించటంలో మీడియేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
"మీడియేషన్ అనేది ఒక మెడిటేషన్ లాంటిది. కేసులు పరిష్కారం తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. వివాహ బంధాన్ని ఏకం చేయడంలోనే మీడియేషన్ సఫలం కావడం లేదు. కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మీడియేషన్‌లో నాకు అనుభవం ఉంది. పేద ప్రజలకు మీడియేషన్ ద్వారా సహాయం చేయాలి." - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
వివాహ బంధాన్ని ఏకం చేయడంలోనే మీడియేషన్ సఫలం కావడం లేదని పేర్కొన్నారు. కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. కేసులు పరిష్కారం అనంతరం చాలా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పేద ప్రజలకు మీడియేషన్ ద్వారా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తనకు మీడియేషన్పై అవగాహన ఉందని గుర్తు చేసుకున్న గవర్నర్.. అనేక సార్లు సమస్యలను పరిష్కరించేందుకు తాను మీడియేషన్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
High Court CJ Justice Ujjal Bhuyan on EMW Mediators Parliament : అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ మాట్లాడారు. కోర్టులపై ప్రస్తుతం కేసుల భారం ఎక్కువగా ఉందని.. దానిని తగ్గించడంలో మీడియేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మీడియేటర్ల అవసరం పెరిగిందన్న ఆయన.. కేవలం లాయర్లు మాత్రమే మీడియేషన్ చేస్తారని అనుకోవద్దన్నారు. ఈ సందర్భంగా పుష్ప్ గుప్తా మాట్లాడుతూ.. గృహిణులు మొదలు ఎవరైనా 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ తీసుకోవటం ద్వారా మీడియేటర్లుగా మారొచ్చని సూచించారు.
"ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్ కేసులు అధికంగా ఉన్నాయి. దానిని తగ్గంచడంలో మీడియేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం లాయర్లు మాత్రమే మీడియేషన్ చేస్తారని అనుకోవద్దు."- జస్టిస్ ఉజ్వల్ భయాన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇవీ చదవండి: