రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్షించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య-ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో గవర్నర్ సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ మేరకు వారికి రాజ్ భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఉన్నతాధికారులతో గవర్నర్ రేపు సమీక్షించి రాష్ట్రంలో పరిస్థితులను వాకబు చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, పరీక్షలు, నియంత్రణా చర్యలు, రోగులకు అందుతున్న చర్యలు, సదుపాయాలు, వసతులు తదితర అంశాలపై గవర్నర్ అధికారులతో చర్చించనున్నారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్