ETV Bharat / state

Governor: 'లింగవివక్షత లేని సమాజ స్థాపనకు కలిసికట్టుగా కృషిచేయాలి'

సాధికారత, సమానత్వం, సమ్మిళిత సమాజ సాధన కోసం మహిళా నాయకత్వాన్ని అన్ని దశల్లోనూ పెంపొందించాల్సిన అవసరం ఉందని గవర్నర్ (Governor) తమిళిసై సౌందరరాజన్ (Tamilisai) అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్​వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరంను గవర్నర్ చెన్నై నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

governor tamilisai
governor tamilisai
author img

By

Published : Jun 24, 2021, 9:52 PM IST

కార్పొరేట్ రంగంతో పాటు వివిధ వ్యవస్థల్లో పైస్థాయిలో మహిళా నాయకత్వం చాలా తక్కువగా ఉందని గవర్నర్​ తమిళిసై (Tamilisai) ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందాల్లో మహిళలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అప్పుడే మహిళలకు సమాన ప్రాతినిధ్యం దొరుకుతుందని, లింగ వివక్ష తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సాఫ్ట్​వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరంను గవర్నర్ (Tamilisai) చెన్నై నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

మొత్తం ఎంటర్ ప్రెన్యూర్లలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారని... ఎంటర్ ప్రెన్యూర్​షిప్ పెంపొందించేందుకు మరింతగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో ఎక్కువ మంది మహిళలు భాగస్వామ్యం అయితే భారతదేశ జీడీపీ ఎన్నో రెట్లు పెరుగుతుందని వివరించారు. పురుషులకు మాత్రమే సొంతం అనుకున్న అనేక రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారని తమిళిసై వివరించారు.

అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం, సరైన నాయకత్వం సాధించేందుకు, లింగవివక్ష లేని సమాజాన్ని నిర్మించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని తమిళిసై (Tamilisai) పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్ సాఫ్ట్​వేర్ ఎంటర్​ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు భరణి కుమార్, ఉమెన్ లీడర్స్ ఫోరం ప్రతినిధులు మమతా మాదిరెడ్డి, నరసింహారావు, మనీషా సాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఎలక్ట్రానిక్‌ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.