ETV Bharat / state

తెలంగాణకు ఆ సామర్థ్యం ఉంది: గవర్నర్ - konda laxman horticulture university news

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అన్ని రంగాలు కుదేలైనప్పటికీ వ్యవసాయ రంగం మాత్రం వృద్ధి సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తాజా, ప్రాసెస్ ఆహార పదార్థాల విషయంలో పురోగతి సాధిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Governor tamili sai
గవర్నర్ తమిళిసై
author img

By

Published : Apr 7, 2021, 3:43 PM IST

  • శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. హార్టికల్చర్ ఉద్యోగ, ఎంటర్ప్రెన్యూర్షిప్ కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. పట్టాలు పొందిన విద్యార్థుల గొప్ప భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు. pic.twitter.com/EuiljKSOOh

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉద్యానవన పంటల విషయంలో ఆరు సంవత్సరాల్లో తెలంగాణ మంచి పురోగతి సాధించిందని... మరింత వృద్ధి సాధించేందుకు సామర్థ్యం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ వర్చువల్​గా పాల్గొన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో రైతులు, వ్యవసాయ ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలిసిందని గవర్నర్ అన్నారు. వైరస్ వల్ల అన్ని రంగాలు ప్రతికూల వృద్ధి సాధించినప్పటికీ... వ్యవసాయం మాత్రం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ప్రపంచంలోని పండ్లు, కూరగాయాల విషయంలో భారతదేశం ప్రధాన సాగుదారుగా ఉందని... భవిష్యత్తులో తాజా, ప్రాసెస్ ఆహార పదార్థాల విషయంలో ప్రధాన ఎగుమతిదారుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో వచ్చే కొన్నేళ్లలో ఉద్యానవన పంటల విషయంలో పెట్టుబడులు మూడు రెట్లు పెరుగుతాయన్న అంచనా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటూ రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా వ్యవసాయ, ఉద్యానవన విద్య, పరిశోధన మార్పు జరగాలన్న ప్రధానమంత్రికి ఆలోచనకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఎక్కడ స్థలం ఉన్నా చెట్లు, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వర్చువల్​గా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మోహపాత్ర పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.