ETV Bharat / state

కుక్కలు కరిచి బాలుడు చనిపోతే ఆకలితో ఉన్నాయనడమేంటి.. మేయర్​పై రేవంత్ ఫైర్ - latest news on Governor

Revanth Reddy on Hyderabad boy death in dogs attack : కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై , పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనపై హైదరాబాద్ మేయర్, మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Feb 22, 2023, 1:17 PM IST

Updated : Feb 22, 2023, 1:54 PM IST

Governor tweet on Hyderabad boy death in dogs attack : హైదరాబాద్​లో బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ ఎరుకల బస్తీలో నాలుగేళ్ల బాలుడిపై వీధి శునకాలు విచక్షణారహితంగా దాడిచేయడం బాధాకరమని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని ట్వీట్ చేశారు. బాలుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఇప్పటికే ఉన్న ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవడంలేదని ఈ ఘటన నిరూపించిందని గవర్నర్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే పరిష్కారాలు వెతకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్​లో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు.

  • Pained to see this sad incidence. Only such painfull incidences should not remind us the need for permanent solutions.Administration should take some proactive measures. This incidence prooves that existing arrangements are not adequate to combat this menace. No words 2 console https://t.co/BlLvLCunGl

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Revanth Reddy tweet on Hyderabad boy death in dogs attack ​: వీధికుక్కలు మనుషులను పీక్కుతినే పరిస్థితి ఈ ప్రభుత్వ హయాంలో రావడం దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపితే మానవత్వం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌ మేయర్‌ కుక్కలకు ఆకలేసిందని మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయినా సర్కారు పట్టించుకోలేదని రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. బాలుడు మరణిస్తే మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అసలేం జరిగింది:నిజామాబాద్​కి చెందిన ముత్యం గంగాధర్ ఛే నెంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జీవిస్తున్నారు. భార్య జనప్రియ, 8 ఏళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్(4)లతో కలిసి బాగ్ అంబర్‌పేట్ ఎరుకల వీధిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరిని తీసుకొని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ దగ్గరకు వెళ్లాడు. ప్రదీప్‌ ఆడుకుంటుండగా తండ్రి పనుల్లో నిమగ్నమయ్యాడు.

బాలుడు అక్క కోసం నడుచుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా కుక్కలు వెంబడించాయి. వాటిని చూసి భయపడిన బాలుడు తప్పించుకునేందుకు అటూ ఇటూ పరిగెత్తాడు. ఎంతకీ వదలని కుక్కలు ఒకదాని తర్వాత ఒకటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రదీప్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 22, 2023, 1:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.