అవసరమైన జంటలకు సహాయపడేలా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్‌ను అందుబాటులో సరసమైనదిగా మార్చాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది పేదలు పిల్లలు పుట్టాలనే కోరికను తీర్చడానికి అసిస్టెడ్ రిప్రొక్టివ్ టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ఇండియా ఐవీఎఫ్ సమ్మిట్ 2వ ఎడిషన్‌లో జరిగిన భారత వంధత్వ మహమ్మారిని పరిష్కరించడం అనే అంశంపై గవర్నర్ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ మోడ్ ద్వారా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సమాజంలో సంతానం లేని జంటలకు కలంకం కలిగించినందుకు విచారం వ్యక్తం చేసిన గవర్నర్.. పిల్లలులేని జంటలను ముఖ్యంగా మహిళలను కలంకం చేసే అమానవీయ అభ్యాసాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద వంధ్యత్వ చికిత్సను అందుబాటులో ఉంచాలన్న నిర్వాహకులు, సదస్సులో పాల్గొన్న వారి అభ్యర్థనపై స్పందిస్తూ.. ఈ విజ్ఞప్తిని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
బాలికకు మూడు చక్రాల మోటార్ సైకిల్ అందజేత..
అంతకుముందు ఫ్లోరోసిస్‌తో బాధపడుతోన్న బాలికకు మూడు చక్రాల మోటార్ సైకిల్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అందజేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం సాయిబండ తండాకు చెందిన రమావత్ సువర్ణ పరిస్థితిని వివరిస్తూ ప్రవాస భారతీయుడు జలగం సుధీర్ గవర్నర్‌కు ట్విట్టర్ వేదికగా వివరించారు.
స్పందించిన గవర్నర్ బాలికను ఆమె కుటుంబంతో పాటు రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. మోటార్ సైకిల్‌ను బాలికకు అందజేశారు. ఈ సందర్భంగా సువర్ణ తాను సొంతంగా వేసిన గవర్నర్ ఫొటో పెయింటింగ్‌ను గవర్నర్‌కు అందించారు. చేయి పూర్తిగా సహకరించకపోయినప్పటికీ.. పెయింటింగ్ వేయటాన్ని గవర్నర్ అభినందించారు. పెయింటింగ్, చదువును కొనసాగించాలని.. దీనికి సంబంధించి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాలిక కుటుంబంతో గవర్నర్ భోజనం చేశారు. చదువులకు సంబంధించి అవసరమైన సహాయం చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: CM KCR On Dalit Bandhu: దళిత బంధు కోసం రూ.లక్ష కోట్లు: సీఎం