AP government has backed down on registration powers: గ్రామ-వార్డు కార్యదర్శులకే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పిస్తూ ఇచ్చిన జీవోపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. సబ్ రిజిస్ట్రార్ అధికారాలు తీసివేయడంపై హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిగింది.
వార్డు కార్యదర్శులకే అధికారాలు చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ వివరించారు. సబ్ రిజిస్ట్రార్ అధికారాలు తొలగించడం హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని కోర్టుకు నివేదించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ అధికారాలు కొనసాగుతాయని లిఖితపూర్వకంగా తెలపడంతో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, సోమయాజులు ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ముగించింది.
ఇవీ చదవండి: