ETV Bharat / state

Covid Effect: రాష్ట్ర అవతరణ వేడుకల రద్దుకు ప్రభుత్వ యోచన - తెలంగాణ అవతరణ వేడుకల రద్దు

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఈసారీ జరిగే అవకాశం కనిపించడం లేదు. కరోనా, లాక్‌డౌన్‌ దృష్ట్యా ఉత్సవాలను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. గత ఏడాది మాదిరే ఈ సారి సీఎం ప్రగతిభవన్‌లో, మంత్రులు, కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

government-plans-to-cancel-state-formation-ceremonies
Covid Effect: రాష్ట్ర అవతరణ వేడుకల రద్దుకు ప్రభుత్వ యోచన
author img

By

Published : May 28, 2021, 7:51 AM IST

2014లో తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి జూన్‌ 2న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఉత్తమ సేవలు అందించిన శాఖలు, అధికారులు, ఉద్యోగులకు సేవా పురస్కారాలను సైతం అందజేస్తోంది.

కరోనా కారణంగా గతేడాది ప్రభుత్వం ఈ ఉత్సవాలను రద్దు చేసింది. సీఎం కేసీఆర్‌ (CM KCR) హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో, మంత్రులు, కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సారి కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉండటంతోపాటు ఆంక్షలతో లాక్‌డౌన్‌ (Telangana Lockdown) అమలవుతోంది. దీంతో ఈ ఏడాది కూడా అవతరణ వేడుకలను నిర్వహించకూడదని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. గత ఏడాది మాదిరే ఈ సారి సీఎం ప్రగతిభవన్‌లో, మంత్రులు, కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం (Government) నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది.

ఇదీ చూడండి: ts Budget: బడ్జెట్ కేటాయింపుల్లో సర్దుబాటుపై ఆర్థికశాఖ కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.