Sajjala Ramakrishna Reddy: కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే వైసీపీ విధానమని.. అందుకు అవకాశం ఉన్నంతవరకూ పోరాటం చేస్తామని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటిషన్.. దాని విచారణపై స్పందించిన సజ్జల.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం చేస్తోంది వైసీపీనే అన్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తొలుత స్వాగతించేది తామేనని స్పష్టం చేశారు.
"విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తాం. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి, లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం..రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తూనే ఉన్నాం. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అంతకంటే ఏం కావాలి..రెండు రాష్ట్రాలు కలిసేందుకు వైసీపీ పోరాటం చేస్తోంది." సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు
ఇవీ చదవండి: