గోకుల్‌చాట్, లుంబినీపార్కు బాంబు పేలుళ్లకు పాల్పడిన దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పేలుళ్లు జరిగి నేటికి 12 ఏళ్లు అయిన సందర్భంగా... గోకుల్ చాట్ వద్ద మృతులకు పలువురు నివాళులర్పించారు. పేలుళ్లలో అవయవాలు కోల్పోయి బాధలు పడుతున్న వారికి... ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరారు. న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచూడండి: ' సెంటిమెంట్లతో రాజ్యమేలడం తెలంగాణలో సాధ్యం కాదు'