దేశంలో కరోనా నివారణలో హైదరాబాద్ జీఎంఆర్ ఎయిర్ కార్గో కీలక పాత్ర పోషిస్తోంది. కరోనాతో యుద్ధానికి తన వంతు కృషి చేస్తోంది. తాజాగా అమెరికాలోని డల్లాస్ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ రూపంలో కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను అందుకుంది. సుమారు 2352 కిలోల బరువున్న మొత్తం 8 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చాయి.
భారత్లో కరోనా రెండో దశ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ అన్ని రాష్ట్రాలకు జీఎంఆర్ తన సేవలను అందిస్తోంది. కొవిడ్ టీకాలు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల రవాణాను జీఎంఆర్ సజావుగా నిర్వహించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 100 టన్నులకు పైగా కొవిడ్ వ్యాక్సిన్లను హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు దిగ్విజయంగా పంపిణీ చేసింది.
ఇదీ చదవండి: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. రైతుల ఎదురుచూపులు