ETV Bharat / state

'ఇంటర్ ఫలితాల బాధ్యతల నుంచి గ్లోబరీనా తొలగింపు... సీజీజీకి అప్పగింత'

పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు, ఫలితాల నిర్వహణలో గ్లోబరీనాను బాధ్యతల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఐటీ శాఖ పరిధిలోని సీజీజీకి బాధ్యతలు అప్పగించనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు.

author img

By

Published : Dec 11, 2019, 5:08 AM IST

విద్యార్థులూ... ధైర్యంగా పరీక్షలకు సిద్ధమవ్వండి : ఇంటర్ బోర్డు
విద్యార్థులూ... ధైర్యంగా పరీక్షలకు సిద్ధమవ్వండి : ఇంటర్ బోర్డు

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో గతేడాది తలెత్తిన గందరగోళం నేపథ్యంలో... ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షల సాంకేతిక సేవల బాధ్యత నుంచి గ్లోబరీనా సంస్థను తప్పించాలని బోర్డు నిర్ణయించింది. ఐటీ శాఖ పరిధిలోని సుపరిపాలన సంస్థ సీజీజీ... పరీక్షల బాధ్యత చూస్తుందని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఫలితాలపై విద్యార్థులు ఎలాంటి అపోహాలు, అనుమానాలు పెట్టుకోకుండా... పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. వ్యక్తిగత వివరాలను వెబ్​సైట్​లో పరిశీలించి... ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని సూచించారు.

ఈసారి ఆ ఇబ్బందులు రాకుండా చర్యలు...

గతేడాది సాఫ్ట్ వేర్ లోపాల వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్​ను ముందస్తుగా పరీక్షించకపోవడం వల్లే సమస్యలు ఏర్పడ్డాయన్నారు. ఇప్పుడు వాటన్నింటినీ అధ్యయనం చేశామని... ఈసారి ఇబ్బందులు రాకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు బోర్డులోనే సొంతంగా ఐటీ విభాగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీజీజీ రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా... సాంకేతిక సేవలు అందిస్తామన్నారు.

పరీక్షలను సజావుగా సాగించడమే లక్ష్యం...

సాఫ్ట్ వేర్​లను పరీక్షించామని... ప్రవేశాలు, పరీక్ష ఫీజుల చెల్లింపులో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. గ్లోబరీనా విషయం అప్రస్తుతమని... పరీక్షలను సజావుగా నిర్వహించడమే తమకు ముఖ్యమని అన్నారు. మూల్యాంకనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫలితాలపై విద్యార్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా... మార్చిలో జరగనున్న పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు.

పొరపాట్లుంటే వెంటనే చెప్పండి...

గతేడాది హాల్ టికెట్లలో గందరగోళం తలెత్తిన నేపథ్యంలో... విద్యార్థుల వ్యక్తిగత వివరాలను బోర్డు వెబ్​సైట్​లో ఉంచామని కార్యదర్శి జలీల్ చెప్పారు. విద్యార్థులు తమ వివరాలను పరిశీలించుకుని... ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రిన్సిపల్ ద్వారా తమకు చేరవేస్తే సరిదిద్దుతామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు కూడా జంబ్లింగ్ విధానం అమలు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదని... త్వరలోనే మంత్రితో చర్చిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు మార్చిలో జరగనున్న పరీక్షలకు 9 లక్షల 62 వేల 699 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఎప్పుడు వీలైతే అప్పుడు కోర్సు పూర్తి చేసేలా ఫ్లెక్సీ కోర్సులపై అధ్యయనం చేస్తున్నామన్నారు.

విద్యార్థులూ... ధైర్యంగా పరీక్షలకు సిద్ధమవ్వండి : ఇంటర్ బోర్డు

ఇవీ చూడండి : అప్పుడే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుంటాయి: నామా

TG_HY_59_10_CGG_WILL_CONDUCT_INTER_EXAMS_PKG_Rev_3064645 REPORTER: Nageshwara Chary ( ) పరీక్షల ఫలితాల్లో గత ఏడాది తలెత్తిన గందరగోళం నేపథ్యంలో... ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షల సాంకేతిక సేవల బాధ్యతల నుంచి గ్లోబరీనాను తప్పించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఐటీ శాఖ పరిధిలోని సుపరిపాలన సంస్థ.. సీజీజీకి పరీక్షల బాధ్యత చూస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. ఫలితాలపై విద్యార్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా.. పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. వ్యక్తిగత వివరాలను వెబ్ సైట్ లో పరిశీలించి... ఏవైనా పొరపాట్లు ఉంటే ఇప్పుడే సరిచేసుకోవాలని పేర్కొన్నారు. look వాయిస్ ఓవర్: పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు, ఫలితాల నిర్వహణలో గ్లోబరీనా ప్రమేయాన్ని తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని సీజీజీకి బాధ్యతలు నిర్వహించనుంది. గతేడాది సాఫ్ట్ వేర్ లోపాల వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ ను ముందుగా పరీక్షించకపోవడం వల్లే ఆ సమస్యలు ఏర్పడ్డాయన్నారు. వాటన్నింటినీ అధ్యయనం చేసి... ఈ సారి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నామని తెలిపారు. త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు బోర్డులోనే సొంతంగా ఐటీ విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీజీజీ రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా.. ఐటీ విభాగం సాంకేతిక సేవలు అందిస్తుందన్నారు. సాఫ్ట్ వేర్ లను పరీక్షించామని.. ప్రవేశాలు, పరీక్ష ఫీజుల చెల్లింపులో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. గ్లోబరీనాపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని... పరీక్షలను సజావుగా నిర్వహించడమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. మూల్యాంకనం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఫలితాలపై విద్యార్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకుండా.. మార్చిలో జరగనున్న పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. బైట్: సయ్యద్ ఒమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి వాయిస్ ఓవర్: గత ఏడాది హాల్ టికెట్లలో గందరగోళం తలెత్తిన నేపథ్యంలో... విద్యార్థుల వ్యక్తిగత వివరాలను ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఉంచామని కార్యదర్శి జలీల్ చెప్పారు. విద్యార్థులు వివరాలు పరిశీలించుకొని... ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రిన్సిపల్ ద్వారా తమకు చేరవేస్తే సరిదిద్దుతామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు కూడా జంబ్లింగ విధానం అమలు చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. త్వరలో మంత్రితో చర్చిస్తామని తెలిపారు. మార్చిలో పరీక్షలకు ఇప్పటి వరకు 9 లక్షల 62 వేల 699 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు కోర్సు పూర్తి చేసేలా ఫ్లెక్సీ కోర్సులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.