ETV Bharat / state

తిరుపతిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు - viral news in ap

GIRLS MISSING IN TIRUPATI: ఆంధ్రప్రదేశ్​ తిరుపతిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అదృశ్యం అయిన ఘటన కలకలం రేపింది. బాలికలు, బాలురు కనిపించకపోవడంతో.. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుపతిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

author img

By

Published : Nov 9, 2022, 3:21 PM IST

GIRLS MISSING IN TIRUPATI: తిరుపతిలో పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని నెహ్రూనగర్​​లోని అన్నమయ్య విద్యాసంస్థల్లో పదోతరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. ఉదయం 6 గంటల సమయంలో ట్యూషన్​కు వెళ్లి.. అక్కడ పరీక్ష రాసిన అనంతరం ముగ్గురు బాలికలు, ఓ బాలుడు 8 గంటల10 నిమిషాలకు బయటకు వచ్చి .. ట్యూషన్​కి రాని మరో మిత్రుడిని తీసుకుని వెళ్లినట్లు సమాచారం.

9 గంటలకు పాఠశాల ప్రారంభమైనా బాలికలు, బాలుడు తరగతి గదులకు హజరుకాకపోవడంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి విచారించారు. పాఠశాల యాజమాన్యం, పిల్లల తల్లిదండ్రులు నగరంలోని పలు ప్రాంతాలలో గాలించిన ప్రయోజనం లేకపోయింది. ఎంత వెతికినా అచూకీ లభించకపోవడంతో పశ్చిమ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.