ETV Bharat / state

రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక - celebrations

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్​కు అనూహ్య స్పందన లభిస్తోంది. తమ ప్రియతమ నాయకుడికి... వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతరులు చిరునవ్వుతో కానుకలిచ్చి.. రామన్నకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చిరునవ్వుతో ఓ కానుక
author img

By

Published : Jul 24, 2019, 6:43 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు, ఆయన అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్​ను ప్రేరణగా తీసుకుని సినీ, రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు సమాజానికి ఉపయోగపడే పనులు చేశారు. గిఫ్ట్​ ఏ స్మైల్ హ్యష్ ట్యాగ్​తో పలువురికి ఛాలెంజ్​ విసురుతున్నారు.

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు, ఇతర రాజకీయ ప్రముఖులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మహేశ్, సినీ రంగానికి చెందిన పలువురు కేటీఆర్​కు శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్ కాన్సులెట్ జనరల్ కేథరిన్ హడ్డాతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

  • Happy birthday @KTRTRS
    Wishing you a long healthy and prosperous life.

    — Harish Rao Thanneeru (@trsharish) July 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మొక్కలు నాటిన ప్రముఖులు..

కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్​కుమార్ గిఫ్ట్​ ఏ స్మైల్ ఛాలెంజ్​ స్ఫూర్తిగా తీసుకుని కీసరగుట్ట సమీపంలోని అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. ఈ ఛాలెంజ్​ను సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, సినీనటులు విజయదేవరకొండ, నితిన్​లకు విసిరారు. ఈరోజు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నితిన్ ఓ మొక్క నాటి... శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ మంచి కార్యక్రమం అని ఇందులో తనను భాగస్వామిని చేసినందుకు సంతోష్​కుమార్​కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నితిన్​ మొక్క నాటడాన్ని కేటీఆర్ అభినందించారు.

కేటీఆర్ జన్మదినం, గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్​లో భాగంగా డిప్యూటి మేయర్ బాబా ఫసియూద్దీన్, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​తో కలిసి మొక్కలు నాటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మర్రిరాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

అండగా నిలుస్తూ..

గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్​ను స్వీకరించిన పలువురు ప్రముఖులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆర్థిక సాయం, రక్తదాన, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. అనాథలు, వృద్ధులకు తమ వంతుగా సహాయం అందించారు. జబ్బులతో బాధపడుతున్న వారికి భరోసానిస్తూ.. ఆర్థిక సాయం చేశారు. మొక్కలు నాటి తోటి వారిని అదే బాటలో నడిపారు. కొంతమంది.. పిల్లల చిరునవ్వులతో శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: సర్పంచ్​ల అరెస్ట్​... ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే

Intro:హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి: ఎంపీపీ విజయలక్ష్మి ఎంపీడీవో

Body:ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమిష్టిగా నిర్వహించాలని ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ ప్రత్యేక అధికారులకు కు పై సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటి కి మొక్కలు సరఫరా చేసి పెంచుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుందని నాటిన 90% మొక్కలు పెరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామానికి కి 40 వేల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. మొక్కలు నాటే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సూచించారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి, 9866815234
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.