హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఓటర్ల ముసాయిదా జాబితాను జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ శనివారం విడుదల చేశారు. ఇందులో మొత్తం 150సర్కిళ్లలో 74లక్షల 4వేల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని కమిషనర్ తెలిపారు. వార్డుల వారిగా తుది ఫోటో ఓటర్ల జాబితాను ఈ నెల 13న ప్రకటిస్తామని వెల్లడించారు.
నమోదైన ఓటర్లలో...
- పురుషులు - 38లక్షల 56వేల 617 మంది
- మహిళా ఓటర్లు - 35లక్షల 46వేల 731మంది
- ఇతరులు - 669 మంది
ఇదీ చదవండి: వివాదాస్పదంగా మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహం!