ETV Bharat / state

స్వచ్ఛతలో సత్తా చాటేదెలా..? - జీహెచ్ఎంసీ వార్తలు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగ్యనగరాన్ని అగ్రస్థానాన నిలపాలని బల్దియా ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. బిన్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వడం లేదు. ఎక్కడ పడితే అక్కడే చెత్త పేరుకుపోతుండటంతో స్వచ్ఛ ర్యాంకింగ్‌ మరింత కష్టతరంగా మారుతోంది.

ghmc-trying-to-make-bin-free-city
స్వచ్ఛతలో సత్తా చాటేదెలా..?
author img

By

Published : Mar 29, 2021, 11:40 AM IST

బిన్​ ఫ్రీ సిటీగా మార్చేందుకు బల్దియా చేస్తున్న ప్రయత్నాలు అన్ని వృథాగానే పోతున్నాయి. గోల్కొండలాంటి స్వచ్ఛ ఐకానిక్‌ ప్రాంతంలోనూ వ్యర్థాల నిర్వహణ సరిగా లేదు. మోతీ దర్వాజ వద్ద చెత్త పేరుకుపోతోందంటూ స్థానికులు ఫిర్యాదు చేయడం ఏరివేసిన తర్వాత మళ్లీ అక్కడే పారేయడం నిత్యకృత్యమైంది.

వీధులన్నీ చెత్తమయం..

నిరంతరం చెత్తను తరలిస్తున్నామనేందుకు సంకేతంగా బిన్‌ ఫ్రీ పద్ధతిని అవలంబిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది సఫలీకృతం కావడం లేదు. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయి స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హరినగర్‌లో గార్బేజ్‌ కలెక్టింగ్‌ పాయింట్లు లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌కే నగర్‌, జమిస్తాన్‌పూర్‌లో ఎక్కడి పడితే అక్కడే చెత్తను డంప్‌ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంటి నుంచి చెత్త సేకరించే వ్యక్తులు కొద్ది రోజులుగా రావడం లేదని దీంతో ఇళ్లలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని అత్తాపూర్‌లోని నలందనగర్‌వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. డబీర్‌పురా డివిజన్‌లోని నూర్‌కాన్‌ బజార్‌లోనూ ఇదే తీరు.

గార్బేజ్‌ ఫ్రీలో వెనుకబాటు..

గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గార్బేజ్‌ ఫ్రీ సిటీస్‌ ర్యాంకింగ్స్‌లో నగరానికి ఎలాంటి స్థానం లభించలేదు. గత స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో 23వ ర్యాంకు వచ్చినప్పటికీ డస్ట్‌బిన్‌ ఫ్రీ, నాలాల వద్ద చెత్తను పారేయడం, ప్లాస్టిక్‌ రహిత నగరం తదితర అంశాల్లో విఫలం అవడంతో గార్బేజ్‌ ఫ్రీ ర్యాంక్‌ దక్కలేదు. ప్రస్తుతం ఇదే విధానాన్ని కొనసాగిస్తుండడం గమనార్హం. స్వచ్ఛతపై దృష్టి పెట్టి అగ్రస్థానంలో నిలవాలని పౌరులు, స్వచ్ఛంద సంస్థలు కోరుకుంటున్నాయి.

ఇదీ చూడండి: డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో వీరంగం... పోలీసులపై దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.