గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశం ఇవాళ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకు ఆన్లైన్ వేధికగా సమావేశం జరుగనుంది. కొవిడ్ నియమ, నిబంధనల నేపథ్యంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించేందుకు సభ్యులందరికీ ఐడీలను అధికారులు పంపించారు. ఈ సమావేశంలో మొదటగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగిస్తారు.
అనంతరం 2021-22 సంవత్సరానికి గాను రూపొందించిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ఆమోదం అనంతరం జరిగే సాధారణ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తారు. లింగోజిగూడ వార్డుకు జరిగిన ఉపఎన్నికలో గెలుపొందిన రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని మేయర్ విజయలక్ష్మి చేయించనున్నారు. నగరంలో వరదలు ఇతర అంశాలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: SCHOOL FEE: స్కూల్ ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు