లాక్డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం: మేయర్ - ఎస్ఆర్డీపీ పనులను పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్
హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ పనులను వేగవంతం చేసేందుకు లాక్డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణం, ఆర్వోబీలు, రహదారుల విస్తరణ-నిర్వహణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. లాక్డౌన్ పూర్తయ్యేలోపు మెజారిటీ పనులు పూర్తి చేయటమే తమ ముందున్న లక్ష్యమన్నారు. రోడ్ల సుందరీకరణ, విస్తరణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామంటున్న మేయర్ బొంతు రామ్మోహన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
లాక్డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం: మేయర్