హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. స్థానిక భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మీ రామన్ గౌడ్‌తో కలిసి నారాయణగూడలోని నాలాను పరిశీలించారు. నాలాలో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలింగిచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నాలాకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని సూచించారు. బోయిన్‌పల్లిలో నాలాలో పడి బాలుడు మృతి చెందారని... మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నాలాకు ఇరువైపులా ప్రహరీ గోడ నిర్మించేందుకు నిధులు మంజూరు చేశామన్నారు.
ఇదీ చదవండి: RATION CARDS:పెండింగ్‌లో ఉన్న 4,46,169 మందికి రేషన్ కార్డులు