జీహెచ్ఎంసీ కార్పొరేటర్లంతా శుక్రవారం నుంచి వారి వార్డు పరిధిలో రెండు గంటలపాటు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు పర్యవేక్షించాలని సూచించారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్లో మూడు రోజుల నుంచి ముమ్మరంగా గార్బేజ్ తొలగింపు, పారిశుద్ధ్య నిర్వాహణ కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు. దీనికి కొనసాగింపుగా కార్పొరేటర్లందరూ తమ పరిధిలో నిత్యం చెత్తతో ఉండే ప్రాంతాల్లో... చెత్త తొలగింపు, వ్యాధుల వ్యాప్తి నిరోధానికి హైపో క్లోరైట్ ద్రావకాన్ని విస్తృతంగా స్ప్రే చేయించాలని సూచించారు. ఇంటి నుంచి వచ్చే చెత్తను... స్వచ్ఛ ఆటోలకే అందించేలా అందరిని చైతన్యపర్చాలని తెలిపారు. కొవిడ్-19ను అడ్డుకునేందుకు ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఇదీ చూడండి: ఎస్ఎల్బీసీ ఇన్లెట్కు ముప్పు.. టీబీఎం దెబ్బతినే ప్రమాదం