హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో సరూర్ నగర్ నుంచి కొత్తపేట చౌరస్తా వరకు ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు. మహిళల రక్షణ కోసం దేశంలో కఠిన చట్టాలు తేవాల్సి ఉందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: "నిందితుడిని వెంటనే ఉరి తీయాలి"