ETV Bharat / state

'ఐటీ కారిడార్​లో నేటి నుంచి సాధారణ పరిస్థితి ఉంటుంది'

author img

By

Published : Mar 6, 2020, 5:48 AM IST

మాదాపూర్​ ఐటీ కారిడార్​లో ఇవాళ్టీ నుంచి సాధారణ పరిస్థితి ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్​ తెలిపారు. మొన్నటి కంటే నిన్న పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో 100 కంపెనీలతో సమావేశం జరిగినట్లు.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించామన్నారు.

'ఐటీ కారిడార్​లో నేటి నుంచి సాధారణ పరిస్థితి ఉంటుంది'
'ఐటీ కారిడార్​లో నేటి నుంచి సాధారణ పరిస్థితి ఉంటుంది'

హైదరాబాద్​ మాదాపూర్​ ఐటీ కారిడార్​లో నేటి నుంచి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్​ పేర్కొన్నారు. బుధవారం కంటే గురువారం పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. మాదాపూర్​లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) వార్షిక వేడుకలకు ఆయన హాజరయ్యారు.

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో 100 కంపెనీలతో సమావేశం జరిగినట్లు జయేశ్​ రంజన్​ తెలిపారు. ఆయా కార్యలయాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించామన్నారు. వ్యక్తిగతంగా జలుబు, దగ్గు లాంటివి ఉన్న ఉద్యోగులను.. ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో జరగబోయే వింగ్స్ కాన్ఫరెన్స్ యధాతథంగా జరగనున్నట్లు జయేశ్​ తెలిపారు.

ఇవీ చూడండి: 'రవాణా సంస్థల్లో స్క్రీనింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.