ETV Bharat / state

"గాంధీ"కి సుస్తీ... విషజ్వరాలతో రోగుల అవస్థ

విష జ్వరాలు రాజధానిలో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవాలు వేరుగా ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం, అసౌకర్యాల మధ్య రోగులు ఆసుపత్రుల్లో నరకం చూస్తున్నారు.

గాంధీ ఆస్పత్రి
author img

By

Published : Sep 19, 2019, 11:22 PM IST

విషజ్వరాల వల్ల గాంధీ ఆస్పత్రిలో రోగులకు ఇక్కట్లు

విష జ్వరాలు, డెంగీతో రాష్ట్రం వణుకుతోంది. రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో విష జ్వరాల రోగులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

ఒకే బెడ్​పై ముగ్గురికి చికిత్స..

మామూలు రోజుల్లోనే ఇక్కడ చికిత్స సరిగా అందదు. ఇక పెరిగిన రోగులతో.. పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. సిబ్బంది కూడా రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు డాక్టర్లు.

పట్టించుకునే నాథుడే లేడు...

పాము కరిచిన వ్యక్తి, జ్వరమొచ్చిన వ్యక్తి, కడుపునొప్పితో బాధపడుతున్న ముగ్గురినీ ఒకే బెడ్​పై పడుకోబెట్టి చికిత్సను అందిస్తున్నారు. మరికొందరు రోగులను నేలపైనే పడుకోబెట్టి ఫైర్ సేఫ్టీ పరికరానికి సెలైన్​ అమర్చి చికిత్సను అందిస్తున్నారు.

ప్రభుత్వం విషజ్వరాల నివారణ చర్యలు సరిగ్గా చేపట్టలేకపోయిందని రోగులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, డాక్టర్లు త్వరగా స్పందించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్సను జాగ్రత్తగా అందించాలని కోరుతున్నారు.

ఇవీచూడండి: వచ్చే నెలలో ఇందూరు వస్తా: సీఎం కేసీఆర్

Intro:సికింద్రాబాద్ యాంకర్..నగరంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి..విష జ్వరాలు డెంగీ వ్యాధి తో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు..గాంధీ ఆసుపత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు..రోగులకు బెడ్ లు లేక ఓకే బెడ్ పై ముగ్గురు కి చికిత్స అందిస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది..మరి కొందరు రోగులకు నేలపైనే పడుకోబెట్టి ఫైర్ సేఫ్టీ పరికరానికి సెలైన్ అమర్చి చికిత్స అందిస్తున్నారు..గాంధీ ఆస్పత్రి లోని వరండాలో అన్ని వార్డుల్లో మారిపోయాయి..రోగులకు సరైన చికిత్స అందించడంలో గాంధీ ఆసుపత్రి సిబ్బంది రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారరు..గాంధీ ఆస్పత్రిలో విషజ్వరాలు డెంగ్యూ బాధితుల తాకిడి ఎక్కువవడంతో వారికి చికిత్స అందించడంలో వైద్యులు విఫలమవుతున్నారు..జిల్లాల నుండి వచ్చిన రోగులు సరైన చికిత్సా లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు..డాక్టర్లు నర్సులు అందుబాటులో లేక రోగులను పట్టించుకునే నాధుడు లేక వారు ఇబ్బందులకు గురవుతున్నారు..ఇప్పటికైనా ప్రభుత్వం డాక్టర్లు త్వరగా స్పందించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్స విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు..ప్రభుత్వం విష జ్వరాల పట్ల నివారణ చర్యల్లో విఫలమైందని రోగుల సంఖ్య అధికం కావడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోక పోవడమే అని రోగులు అంటున్నారు..పాము కరిచిన వ్యక్తి ఫీవర్ వచ్చిన మరో వ్యక్తి తో పాటు కడుపు నొప్పి వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఒకే బెడ్ పై పడుకోబెట్టి చికిత్స అందించడం దారుణమన్నారు..Body:VamshiConclusion:732401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.