వైద్యుల మనుగడను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ వైద్య బిల్లు రూపొందించిందని గాంధీ ఆసుపత్రిలో జూడాలు ఆరోపించారు. జూడాల నిరసన 5వ రోజుకు చేరుకుంది. బయట రోగుల విభాగంతో పాటు అత్యవసర సేవలను కూడా బహిష్కరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బిల్లులో పొందుపరచిన 32వ నిబంధనపై అభ్యంతరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ బిల్లు వల్ల స్థానిక ఆర్ఎంపీలకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లకు తేడా ఉండదని అన్నారు. ఓపీతో పాటు అత్యవసర సేవలు నిలిపివేయటం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం