ETV Bharat / state

విశాఖ‌ నేవీలో పురస్కారాల ప్రదానం - విశాఖలో నేవీ అవార్డుల ప్రదాన కార్యక్రమం

ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌(ఈఎన్‌సీ)కు చెందిన సముద్రిక ఆడిటోరియంలో సోమవారం వివిధ నేవల్‌ యూనిట్లకు, అధికారులకు గాలంట్రీ, నాన్‌-గాలంట్రీ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఈఎన్‌సీ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌, వైస్‌ అడ్మిరల్‌ ఏకే జైన్‌ ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను కొనియాడారు.

విశాఖ‌ నేవీలో పురస్కారాల ప్రదానం
విశాఖ‌ నేవీలో పురస్కారాల ప్రదానం
author img

By

Published : Oct 6, 2020, 6:20 PM IST

ర‌క్ష‌ణ ద‌ళాల్లో విశిష్ట సేవ‌లందించిన వారికి ప్ర‌క‌టించిన సేవా అవార్డుల ప్రదాన కార్య‌క్ర‌మం తూర్పునౌకాద‌ళంలో నిర్వ‌హించారు. తూర్పు నౌకాద‌ళ ప్ర‌ధానాధికారి వైస్ అడ్మిర‌ల్ అతుల్ కుమార్ జైన్ గాలంట‌రీ, నాన్ గాలంట‌రీ అవార్డుల‌ను వివిధ నౌకాద‌ళ యూనిట్ల‌లో ప‌ని చేసే వారికి అందజేశారు.

ఏపీ విశాఖ‌లోని స‌ముద్రిక అడిటోరియంలో నిర్వ‌హించిన ఈ అవార్డుల ప్రదానోత్స‌వానికి సీనియ‌ర్ నేవీ అధికారులు, వారి కుటుంబ‌స‌భ్యులు హాజ‌ర‌య్యారు. నేవల్ ఇన్వెస్టిట్యూర్ ఉత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. కమాండ‌ర్ ప్ర‌కాశ్​ వివేక్​కి యుద్ద సేవా పతకం అందించారు. రియ‌ర్ అడ్మిర‌ల్ జ్యోతిన్ రైనా, నివాస్​ల‌కు న‌వ్ సేనా పతకాలు(గాలంట‌రీ) ల‌భించాయి. కమాండర్లు పీసీ మ‌ర‌ఘాత వేల‌న్, ఆర్.విజ‌య్ శేఖ‌ర్​ల‌కు న‌వ‌సేనా మెడ‌ల్ (డివోష‌న్ టు డ్యూటీ), కెప్టెన్​లు ర‌వికుమార్, రామ్ దులార్, శ్రీ‌కాంత్ ప‌ర‌శ్ రాం మ‌నేల‌కు విశిష్ట సేవాపతకాలు ప్రదానం చేశారు.

వికె జైన్ మెమోరియ‌ల్ గోల్డ్ మెడ‌ల్​ను లెప్టెనెంట్ క‌మాండ‌ర్ వి.రాజేశ్​ కుమార్ సింగ్, జీవ‌న్ ర‌క్ష‌క్ ప‌డ‌క్ అవార్డు ముఖేశ్​ కుమార్​కి ల‌భించాయి. ఐఎన్ఎస్ సుజాత‌, క‌ర్ణ‌, చిల్కా‌, క‌ళింగ‌ల‌కు యూనిట్ సైటేష‌న్లు అందించారు.

ఇదీ చదవండి: 30 ఏళ్లపాటు సేవలందించిన నౌక ఆఖరి యాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.