భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమని ప్రజా గాయకులు గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేరుతో ప్రభుత్వం కావాలనే అంబేడ్కర్ వేడుకలను నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు.
అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గద్దర్ పూలమాల వేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్యతో కలిసి నివాళులర్పించారు.
ఇదీ చూడండి: అక్షరాన్ని ఆయుధంగా మలిచిన వ్యక్తి అంబేడ్కర్: హరీశ్ రావు