తెదేపా సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం... కోడెలది ఆత్మహత్యగానే భావిస్తున్నామని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం తదుపరి విచారణ చేపడతామని తెలిపారు. రెండు కెమెరాలతో శవపరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఇవీచూడండి: 'అ'కాలం చేస్తున్న తెలుగుదేశం నేతలు