ETV Bharat / state

'మీ లక్ష్యం నేరవేరాలంటే నిధులు సొసైటీల్లోనే జమ చేయాలి' - Funds to Fisheries Societies Latest News

చేపల కొనుగోలు టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మత్స్యకారులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం పేర్కొంది. సర్కార్ లక్ష్యం నేరవేరి నేరుగా మత్స్యకారులకే లబ్ధి జరగాలంటే మత్స్యసహకార సొసైటీల్లోనే నిధులు జమచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

'మీ లక్ష్యం నేరవేరాలంటే నిధులు సొసైటీల్లోనే జమ చేయాలి'
చేప పిల్లల టెండర్లు రద్దు చేయాలి : బాలకృష్ణ బెస్త
author img

By

Published : Jun 13, 2020, 11:40 PM IST

Updated : Jun 14, 2020, 9:44 PM IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల టెండర్ల వల్ల మత్స్యకార సంఘాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరట్లేదని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళ వ్యక్తం చేశారు. చేప పిల్లల కొనుగోలుకు సంబంధించి సొసైటీ బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది. చేప పిల్లల పంపిణీ టెండర్లలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని మత్స్యకార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దళారీ వ్యవస్థ సైతం రద్దు కావాలి..

మత్స్య రంగంలో వేళ్లూరుకున్న దళారీ వ్యవస్థను ప్రభుత్వమే నిర్మూలించాలని విజ్ఞప్తి చేశారు. దళారీ వ్యవస్థ పూర్తి స్థాయిలో రద్దు అయితేనే చేపల పెంపకం జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులకు లాభం చేకూరుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లల బాలకృష్ణ బెస్తతో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగరాజు ముఖాముఖి.

'మీ లక్ష్యం నేరవేరాలంటే నిధులు సొసైటీల్లోనే జమ చేయాలి'

ఇవీ చూడండి : తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు

Last Updated : Jun 14, 2020, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.