ETV Bharat / state

కల్యాణాలకు అనుమతి వచ్చేనా.. సందడి మొదలయ్యేనా...? - ఏపీ లాక్​ డౌన్​ ఎఫెక్ట్

పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు, పదవీ విరమణ కార్యక్రమాలు సహా ఇతర శుభకార్యాలతో కళకళలాడే ఫంక్షన్ హాళ్లు... కరోనా దెబ్బతో వెలవెలబోతున్నాయి. ఫంక్షన్​ హాళ్లపై ఆధారపడి జీవించే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఫంక్షన్​ హాళ్లు ప్రారంభమై పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో...తమకు ఉపాధి లభిస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

function halls closed due to corona and effected thousand of workers
కల్యాణాలకు అనుమతి వచ్చేనా.. సందడి మొదలయ్యేనా...?
author img

By

Published : Jun 4, 2020, 8:21 PM IST

తెలుగు రాష్ట్రాల్లో... వేసవి కాలంలో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరుగుతాయి. కల్యాణ మండపాలు, ప్రముఖ దేవాలయాలు వేదికలుగా పెళ్లిళ్లు జరిగేవి. అయితే వచ్చిపోయే అతిథులతో అంతట హడావుడి కనిపించేది. కరోనా కారణంగా ఉభయ రాష్ట్రాల్లో... వేలాది వివాహాలు వాయిదా పడ్డాయి. మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. అందరూ ఇంట్లోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. నిత్యావసరాలు, అత్యవసర పనుల మీద బయటకు వచ్చినా.. భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బంధుమిత్రులను ఆహ్వానించి శుభకార్యాలు నిర్వహించలేని పరిస్థితి. కనీసం రెండు కుటుంబాలు కలిసి తంతు ముగించే పరిస్థితి కనిపించడంలేదు.

కర్నూలు జిల్లాలో సుమారు 250 కల్యాణ మండపాలు ఉన్నాయి. వివాహాల కోసం ఆరు నెలల ముందుగానే అడ్వాన్సులు చెల్లించేశారు. ఒక్క కర్నూలు నగరంలోనే 96 ఫంక్షన్‌ హాళ్లు ఉన్నాయి. ఇవ్వన్నీ గత రెండు మాసాల్లో జరగాల్సిన వివాహాలకు ఇవన్నీ బుక్‌ అయ్యాయి. కరోనా దెబ్బతో ఫంక్షన్​ హాళ్లు మూతబడడం వల్ల అడ్వాన్సులు వెనక్కు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల వివాహాలు రద్దు అయినట్లు ఓ అంచనా. కల్యాణ మండపాలపై ఆధారపడి జీవించే సుమారు 10 వేల మందికి పనిలేకుండా పోయింది. పురోహితులు, డోలు సన్నాయి, మంటపాల నిర్వాహకులు, పుష్పాలంకరణ, వంట వారు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, అద్దె వాహనదారులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందో తెలియక ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

కరోనా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టకపోగా... కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శుభకార్యాలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి తిరిగి పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని ఫంక్షన్​ హాళ్ల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి : 'జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.