ETV Bharat / state

"రేవంత్​ వచ్చావా...? రాకుండా ఉంటానా సార్​...?" - RAJ BHAVAN

స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్​ ఇచ్చిన తేనీటి విందులో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. గవర్నర్​ నరసింహన్​కు ఎంపీ రేవంత్​రెడ్డికి మధ్య జరిగిన సంభాషణ అక్కడున్నవాళ్ల దృష్టిని ఆకర్షించింది.   ఇద్దరూ ఛలోక్తులతో మాట్లాడుకున్న విధానం పక్కవాళ్లని నవ్వుల్లో ముంచేసింది.

FRIENDLY CONVERSATION BETWEEN REVANTH REDDY AND GOVERNOR NARASIMHAN
author img

By

Published : Aug 15, 2019, 10:07 PM IST

Updated : Aug 15, 2019, 10:15 PM IST

తేనీటి విందులో సరదా సన్నివేశం

రాజ్​భవన్​లో గవర్నర్​ ఇచ్చిన తేనీటి విందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్​ నరసింహన్​ అందరి దగ్గరికి వెళ్లి ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఇందులో ఆశ్యర్యమేముందంటారా... అక్కడే ఉంది. ఈ విందుకు హాజరైన ఎంపీ రేవంత్ రెడ్డిని గవర్నర్​ కలిసినప్పుడు వారి మధ్య సరదా సంభాషణ జరిగింది.

గవర్నర్​: రేవంత్​ వచ్చారా... మీరు రారేమో అనుకున్నా...
రేవంత్​: మీరు పిలిచాక రాకుండా ఉంటామా...
గవర్నర్​: గతంలోనూ... వస్తానని రాలేదు కదా...
రేవంత్​: మీరు కొడతారేమోనని రాలేదు...సార్​...
గవర్నర్​: కొట్టింది నేనా... మీరా...

అని చురక వేశారు.

అనంతరం గవర్నర్​ నవ్వుతూనే... పక్కనున్న షబ్బీర్​ ఆలీని పలకరించారు... "అబ్బో ఈయన కోపంగా ఉన్నట్టున్నారు..." అంటూ ముందుకు సాగారు. మిగతావారిని పలకరిస్తూ... విందులో గవర్నర్​ నరసింహన్​ నవ్వులు పూయించారు.

ఇవీ చూడండి: మెట్రో రికార్డు: ఒక్కరోజే 3 లక్షల 6 వేల ప్రయాణికులు

Last Updated : Aug 15, 2019, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.