Formula E race in Hyderabad 2024 : ప్రపంచంలో ఉన్న రేసర్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫార్ములా ఈ రేస్ (Formula E Race) వచ్చే ఏడాది కూడా అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఎఫ్ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సీజన్ 10ను చాలా గ్రాండ్‌గా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
-
Formula E comes to #Hyderabad yet again - Feb 10, 2024
— Arvind Kumar (@arvindkumar_ias) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The racing track remains the same as last year - adjacent to Hussain Saagar
Get ready for an enhanced & improved version of sports extravaganza this season @FIAFormulaE @HMDA_Gov pic.twitter.com/UpcG8mpALp
">Formula E comes to #Hyderabad yet again - Feb 10, 2024
— Arvind Kumar (@arvindkumar_ias) October 20, 2023
The racing track remains the same as last year - adjacent to Hussain Saagar
Get ready for an enhanced & improved version of sports extravaganza this season @FIAFormulaE @HMDA_Gov pic.twitter.com/UpcG8mpALpFormula E comes to #Hyderabad yet again - Feb 10, 2024
— Arvind Kumar (@arvindkumar_ias) October 20, 2023
The racing track remains the same as last year - adjacent to Hussain Saagar
Get ready for an enhanced & improved version of sports extravaganza this season @FIAFormulaE @HMDA_Gov pic.twitter.com/UpcG8mpALp
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఫార్ములా ఈ రేస్‌కు ఏర్పాట్లు.. బుక్ మై షోలో టిక్కెట్లు
అయితే ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 హైదరాబాద్‌లోనూ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రేస్‌కు హైదరాబాద్ వేదిక కావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ రేస్‌కు భాగ్యనగరం ఆతిథ్యమివ్వడం పట్ల రేసర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్‌లో ఈ రేస్ జరగనుందని నిర్వాహకులు ప్రకటించారు.
-
Look forward to seeing you Guys in Hyderabad again 👍 https://t.co/ElHt6oANyd
— KTR (@KTRBRS) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Look forward to seeing you Guys in Hyderabad again 👍 https://t.co/ElHt6oANyd
— KTR (@KTRBRS) October 19, 2023Look forward to seeing you Guys in Hyderabad again 👍 https://t.co/ElHt6oANyd
— KTR (@KTRBRS) October 19, 2023
Formula E World Championship Season 10 : మరోవైపు ఫార్ములా ఈ రేస్ జరిగే సీజన్ 10 క్యాలెండర్‌ను మంత్రి కేటీఆర్ (KTR) గురువారం రోజున ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి జులై 21వ తేదీ వరకు ఫార్ములా ఈ రేస్ జరగనుందని చెప్పారు. ఈ మేరకు ఈనెల 19వ తేదీన జరిగిన ఎఫ్ఐఏ అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారని పేర్కొన్నారు. మూడు ప్రధాన దేశాలైన చైనా, భారత్, యూఎస్ఏలలో ఈ రేసింగ్ జరుగనుందని కేటీఆర్ వివరించారు.
వచ్చే ఏడాది ఫార్ములా ఈ రేస్ షెడ్యూల్..
- జనవరి 13న- మెక్సికోలో
- జనవరి 26, 27న- సౌదీ అరేబీయా
- ఫిబ్రవరి 10న- హైదరాబాద్
- మార్చి 16న- బ్రెజిల్లో
- మార్చి 30న- జపాన్
- ఏప్రిల్ 13న- ఇటలీ
- ఏప్రిల్ 27న- మోనాకో
- మే 11,12న- జర్మనీ
- మే25, 26న- చైనా
- జూన్ 29న- యూఎస్ఏ
- జులై 20, 21న- యూకే
ఇటీవలే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్‌ను నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేసు కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లు వాయు వేగంతో కార్లలో దూసుకొచ్చారు. మహింద్రా, జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్ కార్లు ట్రాక్ పై దుమ్ము రేపాయి. మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఇందులో పాన్నారు. ప్రధాన రేస్‌లో జా ఎరిక్ వా మొదటి స్థానంలో నిలిచారు. ఆయనకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీని ప్రదానం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్‌ను వీక్షించేందుకు హైదరాబాద్ వాసులు భారీగా తరలివచ్చారు.
ఫార్ములా ఈ-రేస్.. ఎక్కడ మొదలైంది.. హైదరాబాద్‌కు ఎలా వచ్చింది..?
ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్‌లో గందరగోళం.. ట్రాక్‌పైకి దూసుకొచ్చిన సాధారణ వాహనాలు