ETV Bharat / state

కేంద్ర వ్యవసాయ బిల్లులపై పోరాటానికి.. రైతు సంఘాల పిలుపు! - రైతు సంఘాల ధర్నా

కేంద్ర ఉభయసభల్లో వ్యవసాయ బిల్లుల ఆమోదంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉన్న ఈ బిల్లులు రద్దు చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సైతం రైతు సంఘాలు, రైతులు నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్‌లో రైతు సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ బిల్లుల ప్రతులు దగ్ధం చేశారు. ఈ నెల 25న కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

Former's Association protest Against agriculture bills
కేంద్ర వ్యవసాయ బిల్లులపై పోరాటానికి.. రైతు సంఘాల పిలుపు!
author img

By

Published : Sep 22, 2020, 2:19 PM IST

కేంద్ర వ్యవసాయ బిల్లులను ఆమోదించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు, రైతుసంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కివ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. వ్యవసాయ రంగం, రైతాంగ విశాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ బిల్లులు రాజ్యసభలో అన్యాయంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆలిండియా సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు, రైతులు నిరసన చేపట్టారు. కార్పోరేట్, కాంట్రాక్టు వ్యవసాయంపై ఆర్డినెన్సులు, విద్యుత్ సంస్కరణల బిల్లు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కల్పనకు చట్టం తీసుకు వచ్చి.. కార్పోరేట్​ శక్తులను తరమికొట్టి.. రైతులను కాపాడాలని నినాదాలిస్తూ నిరసన చేపట్టారు. వ్యవసాయం రాష్ట్రాల జాబితాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవేశపెట్టిన బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..

రైతులను కూలీలుగా మార్చే వ్యవసాయ బిల్లులు వ్యతిరేకించాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దేశీయ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టవద్దని... లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన సరైన సమయంలో మోదీ సర్కారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ, మార్కెట్‌ బిల్లులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. రైతు ఉత్పత్తుల వాణిజ్య - వర్తక (ప్రోత్సాహం - సౌలభ్యం) బిల్లు-2020”, “రైతుకు (సాధికారత - రక్షణ) ధరల భరోసా ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు-2020” తమ ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో రైతుసంఘాలు ఆందోళనబాట పట్టడంచూస్తే బిల్లుల పట్ల వ్యతిరేకత అద్దం పడుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న వ్యవసాయ రంగంపై 18 కోట్ల మంది పైగా రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. బిల్లుల కారణంగా దేశవ్యాప్తంగా రైతులు కార్పోరేట్​ సంస్థల చేతుల్లోకి వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాయి.

మోదీ మాటలు అబద్ధం..

అమెరికాలో మాత్రమే సాధ్యమయ్యే కార్పోరేట్ సేద్యం భారత్‌లో యోగ్యమేనా అని రైతుసంఘాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. రైతుల సంకెళ్లు తీసేసే దిశగా చారిత్రాత్మక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేలా స్వేచ్ఛకావాలి. ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని ప్రధాని మోదీ చెబుతుండటం పచ్చి అబద్ధమని... రైతు రక్షణ ఫణంగాపెట్టి సేద్యం నుంచి రైతే.. వైదొలగేలా కార్పోరేట్ రంగానికి వ్యవసాయాన్ని అప్పగించే కుట్ర అని రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆక్షేపించారు.

బిల్లు వెనక్కి తీసుకోవాలి!

రైతుల నుంచి బియ్యం సహా ఆహార ధాన్యాలు, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఎంఎస్‌పీ రూల్ కింద ప్రభుత్వం కొనుగోలు చేయబోదని కొందరు రూమర్లు వ్యాప్తి చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు రక్షణ కవచాలని.. వ్యవసాయంలో రైతులకు కొత్త స్వాతంత్ర్యం లభించినట్లే అని ప్రధాని భరోసా ఇస్తున్నప్పటికీ అవి ఎలాగో చెప్పడం లేదు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా బిల్లులు దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరివర్తనతో పాటు పారదర్శకత తెస్తాయని, ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం విస్తరిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యానించడం పట్ల రైతు సంఘాల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగం సంక్షోభం నేపథ్యంలో గత రెండు దశాబ్దాల కాలంలో మూడున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తే... వ్యవసాయోత్పత్తులకు మద్ధతు ధరలు లేకపోవడమేనన్న నగ్న సత్యం అందరికీ అర్థమవుతుందని రైతు నాయకులు అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కనీస మద్ధతు ధరల్లేక రైతులు అల్లాతుంటే ఆ కాస్త ఎంఎస్‌పీ రాకుండా ప్రైవేటు, కార్పోరేట్ సంస్థకు ధారాదత్తం చేయడం దారుణమని... ఈ బిల్లులు ఉపసంహరించుకోవాలని రైతు స్వరాజ్య వేదిక కార్యదర్శి కొండల్‌రెడ్డి డిమాండ్ చేశారు.

మద్దతివ్వండి..

వ్యవసాయ రంగానికి గొడ్డలి పెట్టులాంటి ఈ బిల్లులను నిరసిస్తూ కేంద్ర ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యవసాయ సంస్కరణల పేరిట మోదీ సర్కారు ఉభయసభల్లో ఆమోదించిన వ్యవసాయ పంటలు అమ్ముకోవడానికి స్వేచ్ఛ, కాంట్రాక్ట్ వ్యవసాయం, వ్యవసాయోత్పత్తుల నిల్వలపై పరిమితి రద్దు ఆర్డినెన్సులు వ్యతిరేకిస్తూ పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనబాట పట్టాయి. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు పంజాబ్‌లో కిసాన్ మజ్ధూర్‌ సంఘర్ష్‌ కమిటీ రైల్‌రోకోకు పిలుపు ఇచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు, రైతులు, రైతు సంఘాలు, నిపుణులను సంప్రదించకుండా ఏకపక్షంగా కేంద్రం... వ్యవసాయ బిల్లులు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని రైతు సంఘాలు ప్రశ్నించాయి. ఈ నెల 25న దేశవ్యాప్త ఆందోళనల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులు తమ సంపూర్ణ మద్ధతు తెలియజేయాలని ఏఐకేఎస్‌సీసీ సభ్యుడు వేములపల్లి వెంకటరామయ్య కోరారు.

ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం..

ప్రపంచంలో అతి పెద్ద మూడో వ్యవసాయ రంగం భారత్‌దే. కోట్లాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం, రైతాంగం ప్రయోజనాలకు విఘాతం కలిగే ఉన్న ఈ బిల్లులపై విస్తృత చర్చ అవసరం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉన్న వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకునే వరకు ఉద్యమాలు కొనసాగించేందుకు ఏఐకేఎస్‌సీసీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

ఇదీ చూడండి: యాదాద్రిలో సకల సౌకర్యాల కల్పనపై యాడా కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.