సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భాజపా జెండా ఎగర వేయడమే లక్ష్యంగా తాను పార్టీలో చేరినట్లు కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కంటోన్మెంట్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
భాజపా అధికారంలోకి వస్తే సత్వర అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే పార్టీలో చేరానని ప్రతాప్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కంటోన్మెంట్లోని అన్ని వార్డులను కైవసం చేసుకుని భాజపా జెండా ఎగర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ బోర్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని ఆరోపించారు. కేంద్రం అధీనంలో ఉండే ప్రాంతంలో అభివృద్ధి కేవలం భాజపా ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెరాసపై ఉన్న వ్యతిరేకతే భాజపాను గెలిపిస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: 'కేసీఆర్ను గద్దె దించుతాం... తెరాస అవినీతిని ప్రజల ముందుంచుతాం'