ETV Bharat / state

రాజేంద్రనగర్​లో చిరుత జాడలను కనుక్కున్న అటవీశాఖ అధికారులు! - hyderabad

రాజేంద్రనగర్​ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుత గురించి పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Forest officials traced leopard in Rajendranagar
రాజేంద్రనగర్​లో చిరుత జాడలను కనుక్కున్న అటవీశాఖ అధికారులు
author img

By

Published : Aug 27, 2020, 7:30 PM IST

హైదరాబాద్​ రాజేంద్రనగర్​లో బుధవారం చిరుతపులి కలకలం సృష్టించింది. హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్​ భవనాన్ని ఇవాళ శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, రాజేంద్రనగర్​ సీఐ సురేష్​, అటవీశాఖ అధికారులు సందర్శించారు.

బుధవారం చిరుత జాడలు కనుక్కోవడానికి కెమెరాలు, బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. రెండు బోన్లలో కుక్కలను ఉంచారు. కెమెరాల్లో చిరుత జాడలను అటవీశాఖ అధికారులు కనుక్కున్నారు. ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు నిర్దారించారు. వీలైనంత త్వరగా చిరుతను పట్టుకుంటామని తెలిపారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో మరోసారి చిరుతపులి కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.